తెలంగాణ

telangana

గంజాయి చాక్లెట్లు విక్రయిస్తున్న వ్యక్తి అరెస్టు

ETV Bharat / videos

హైదరాబాద్​లో గంజాయి చాక్లెట్లు, ఒకరిని అరెస్ట్ చేసిన ఎల్‌బీనగర్‌ ఎస్వోటీ - హైదరాబాద్​ గంజాయి కేసు

By ETV Bharat Telangana Team

Published : Nov 9, 2023, 5:20 PM IST

A person selling ganja chocolates was arrested on the outskirts of Hyderabad: హైదరాబాద్​ నగర శివార్లలో గంజాయి చాక్లెట్లు విక్రయిస్తున్న ఒకరిని ఎల్‌బీనగర్‌ ఎస్వోటీ పోలీసులు అరెస్టు చేసి ఠాణాకు తరలించారు. నిందితుడు బిహార్‌లోని దర్బాంగాకు చెందిన దీపక్‌ కుమార్‌ శర్మగా పోలీసులు గుర్తించారు. ఆ వ్యక్తి ప్రస్తుతం ఎల్‌బీనగర్‌లో నివసిస్తున్నాడు. ప్రారంభంలో నిందితుడే స్వయంగా గంజాయి చాక్లెట్లు తినేవాడు. క్రమంగా అతనే విక్రేతగా అవతారమెత్తాడు. 

Ganja Choclates Seized In Hydrabad : గంజాయి చాక్లెట్లు అవసరమైన వారికి విక్రయిస్తున్నట్లుగా సమాచారం అందుకున్న ఎస్వోటీ పోలీసులు గాలించి దీపక్‌ను పట్టుకున్నారు. నిందితుని దగ్గర 70 గంజాయి చాక్లెట్లు స్వాధీనం చేసుకున్నారు. ఒక్కో చాక్లెట్‌ సుమారు 5 గ్రాములు ఉందని పోలీసులు తెలిపారు. అసలు ఈ చాక్లెట్లు అతనికి ఎవరు సరఫరా చేస్తున్నారు... ఎక్కడ నుంచి వీటిని తీసుకువస్తున్నారు అనే కోణంలో పోలీసులు విచారణ జరుపుతున్నారు. ఎన్నికల వేళ పోలీసులు తనిఖీ చేస్తుండగా గంజాయి, మత్తు పదార్థాలు భారీ మెుత్తంలో పట్టు పడుతున్నాయి.

ABOUT THE AUTHOR

...view details