70 ఏళ్ల వయసులో 1600 అడుగుల ఎత్తు నుంచి పారాజంప్ చేసి రికార్డ్
సాధించాలి అనే తపన ఉంటే అసాధ్యమైనదంటూ ఏమీ లేదు. అలాంటిదే 70 ఏళ్ల రిటైర్డ్ కల్నల్ గిరిజా ముంగలి విషయంలో జరిగింది. 70 ఏళ్ల వయసులో ఆయన 1,600 అడుగుల ఎత్తు నుంచి పారా జంపింగ్ చేసి, సరికొత్త రికార్డు సృష్టించారు. అతను వాస్తవానికి నైనిటైల్వాసి. అయితే ప్రస్తుతం ఆయన తన ఫ్యామిలీతో మహారాష్ట్రలో పుణెలో నివసిస్తున్నారు. ఆయన ప్రస్తుతం ఆసియన్ ఫుట్బాల్ కాన్ఫెడరేషన్ టాస్క్ ఫోర్స్లో మెంబర్. వైమానిక దళంలో పారాచూట్ బ్రిగేడ్ ఫెస్టివల్లో రీయూనియన్ 2022లో ఆయన పాల్గొన్నారు. ఆగ్రాలో అక్టోబరు15న ఎయిర్ క్రాఫ్ట్ నిర్వహించిన పారాజంప్లో పాల్గొని 1,600 అడుగుల పైనుంచి కిందికి దూకి, సరికొత్త రికార్డు సృష్టించారు. 35 మంది సభ్యులు కలిగిన గ్రూప్లో సభ్యునిగా ఈ పారాజంప్లో పాల్గొన్నారు. అయితే ఈ గ్రూప్లో అధిక సంఖ్యలో వృద్ధులే ఉన్నారు.
Last Updated : Feb 3, 2023, 8:32 PM IST