తెలంగాణ

telangana

Tyagaraja worship program

ETV Bharat / videos

Paris Tyagaraja Aradana : అట్టహాసంగా పారిస్​ త్యాగరాజ ఆరాధన వేడుకలు - ఫ్రాన్స్​లోని పారిస్​లో త్యాగరాజ ఆరాధన

By

Published : May 25, 2023, 7:48 AM IST

Updated : May 25, 2023, 7:56 AM IST

Paris Tyagaraja Aradana : ఫ్రాన్స్ రాజధాని పారిస్​లోని సల్లే డెస్ ఫేట్స్‌ టౌన్‌హాల్‌లో 6వ పారిస్ త్యాగరాజ ఆరాధన కార్యక్రమాన్ని అట్టహాసంగా నిర్వహించారు. మేయర్ ఫ్రాన్సిస్ స్జ్‌పినర్ మద్దతుతో ఫ్రాన్స్​లోని భారత రాయబార కార్యాలయం ఆధ్వర్యంలో పారిస్ కర్నాటిక్ కన్జర్వేటరీ ఈ వేడుకలు ఘనంగా జరిపింది. ఈ వేడుకను జీన్ వీనర్ కన్జర్వేటరీ డైరెక్టర్ ఆర్థిర్ థామస్సిస్, సభ్యుడు సామియా బదత్ కరమ్, మైసన్ డీ ఎల్ ఇండే డైరెక్టర్ సౌమ్యలక్ష్మితో కలిసి ప్రారంభించారు. 

త్యాగరాజ పంచరత్న కృతులతో ప్రారంభమైన కార్యక్రమంలో 80 మందికి పైగా కళాకారులు పాల్గొన్నారు. ఈ వేడుక ఓవైపు అతిథులు.. మరోవైపు కళాకారులు.. ఇంకోవైపు వీక్షకులతో సందడిగా జరిగింది. కళాకారులు తమ కళలను ప్రదర్శించి వీక్షకులను ఆకట్టుకున్నారు. వీరి ప్రదర్శనను చూసిన అతిథులు మంత్రముగ్ధులై పోయారు. పద్మ భూషణ్ సుధా రఘునాథన్ వంటి దిగ్గజాలు ఈ వేడుకలో నిర్వహించిన ప్రదర్శనలకు ఫిదా అయిపోయారు. కళాకారులను అభినందించారు. ఈ కార్యక్రమంలో అనూర్ అనంత కృష్ణ శర్మ, డా. నిత్యశ్రీ మహదేవన్, ఉన్నికృష్ణన్, జయంతి కుమారేష్, నిర్మలా రాజశేఖర్, వీణామూర్తి విజయ్, ఘటం కార్తీక్ తదితరులు పాల్గొన్నారు.

Last Updated : May 25, 2023, 7:56 AM IST

ABOUT THE AUTHOR

...view details