తెలంగాణ

telangana

ETV Bharat / videos

146 అడుగుల కార్తికేయ విగ్రహం.. ప్రపంచ రికార్డు బద్దలు! - murugan statue news

By

Published : Apr 7, 2022, 12:42 PM IST

Updated : Feb 3, 2023, 8:22 PM IST

Lord Murugan tallest statue: ప్రపంచంలోనే అతిపెద్దదైన కార్తికేయ స్వామి(మురుగన్) విగ్రహాన్ని తమిళనాడులో బుధవారం ఆవిష్కరించారు. సేలం జిల్లాలోని పుథిర కౌంటమపాలయంలో విగ్రహాన్ని ఏర్పాటు చేశారు. ఇప్పటివరకు మలేసియాలో ఉన్న 140 అడుగుల పథుమలై విగ్రహమే అతిపెద్ద కార్తికేయ స్వామి విగ్రహంగా కొనసాగగా.. ప్రస్తుతం ఈ రికార్డు బద్దలైంది. 146 అడుగులతో సేలంలో విగ్రహాన్ని ఏర్పాటు చేశారు. మలేసియాలో ఏర్పాటు చేసిన విగ్రహ రూపకర్తలే దీన్ని సిద్ధం చేశారు. విగ్రహ కుంభాభిషేకాన్ని వీక్షించేందుకు భారీ ఎత్తున ప్రజలు తరలి వచ్చారు. హెలికాప్టర్ ద్వారా విగ్రహంపై పూలవర్షం కురిపించారు.
Last Updated : Feb 3, 2023, 8:22 PM IST

ABOUT THE AUTHOR

...view details