ప్రపంచవ్యాప్తంగా మిన్నంటిన 'కొత్త ఏడాది' సంబరాలు - అమెరికా నూతన సంవత్సర వేడుకలు
new year celebration 2022: ప్రపంచవ్యాప్తంగా నూతన సంవత్సర వేడుకలు అట్టహాసంగా సాగాయి. అర్ధరాత్రి వరకు ఆడిపాడిన ప్రజలు.. 12 కాగానే కొత్త ఏడాదికి ఘన స్వాగతం పలికారు. ఐఫిల్ టవర్, బుర్జ్ ఖలిఫా వంటి ప్రఖ్యాత కట్టడాలు, భవనాలు విద్యుత్తు దీపాల కాంతుల్లో మెరిసిపోయాయి. ఒమిక్రాన్ భయాలను బేఖాతరు చేస్తూ.. వేడుకల్లో వేలాది మంది పాల్గొన్నారు. అయితే కొన్ని దేశాల్లో ఆంక్షల నేపథ్యంలో న్యూఇయర్ వేడుకలు కళ తప్పాయి.