అమెరికా జాతీయ అడవుల్లో చెలరేగిన మంటలు - అమెరికాలో కార్చిచ్చు
అమెరికా అరిజోనా రాష్ట్రంలోని జాతీయ అడవుల్లో మంటలు చెలరేగాయి. దావానలాన్ని అదుపు చేయడానికి అగ్నిమాపక సిబ్బంది తీవ్రంగా శ్రమిస్తున్నారు. రాష్ట్రంలోని పలు ప్రాంతాల్లో మంటలు వేగంగా వ్యాపిస్తున్నందున ముందు జాగ్రత్త చర్యగా ఆయా ప్రాంతాల్లోని ప్రజలను ఖాళీ చేయాలని ఆదేశాలు జారీ చేశారు అధికారులు. కొరోనాడో నేషనల్ ఫారెస్ట్‌లో దావానలం తీవ్రంగా విస్తరించింది.