మెట్లు ఎక్కుతూ తడబడిన ట్రంప్.. వెంటనే మళ్లీ! - ట్రంప్ తాజా వార్త
అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ శుక్రవారం న్యూ హ్యాంప్‌షైర్‌లో జరిగిన ర్యాలీలో వేదికపైకి వెళ్లేందుకు మెట్లు ఎక్కుతూ తడబడ్డారు. అయితే వెంటనే తేరుకున్న ట్రంప్ అభిమానులకు అభివాదం చేశారు. "మేక్ అమెరికా గ్రేట్ ఎగైన్" ర్యాలీలో ప్రసంగించటానికి పోడియం వద్దకు వెళ్లే క్రమంలో ఇది జరిగింది. అయితే ఈ విషయంపై ట్రంప్ తనదైన రీతిలో స్పందించారు. ఫ్లోర్ "ఐస్ స్కేటింగ్ రింక్"లా ఉందని.. జారి పడకుండా ఉండేందుకు బొటన వేలిపై నడుస్తున్నానంటూ చమత్కరించారు. ప్రసంగంలో భాగంగా అధ్యక్ష ఎన్నికల్లో తప్పకుండా విజయం సాధిస్తానని ధీమా వ్యక్తం చేశారు.