కరోనాతో యుద్ధంలోనూ చైనా 'శక్తి' భేష్! - తెలుగు కరోనా వైరస్ వార్తలు
కరోనాతో ఉక్కిరిబిక్కిరి అవుతున్నప్పటికీ... తన శక్తిసామర్థ్యాలను ప్రపంచానికి మరోసారి చాటి చెప్పింది చైనా. కేవలం 10రోజుల వ్యవధిలోనే 1000 పడకలతో కూడిన ఓ భారీ వైద్య శిబిరాన్ని నిర్మించింది. వైరస్ కేంద్రబిందువైన వుహాన్లో జనవరి 23న మొదలైన పనులు.. సోమవారంతో ముగియనున్నాయి. ఓవైపు మహమ్మారితో యుద్ధం చేస్తూనే.. మరోవైపు రోగులకు అండగా ఉండటానికి అన్ని రకాల చర్యలు చేపడుతోంది. వైరస్ సోకిన రోగులకు వైద్య బృందం ఇక్కడ చికిత్స అందించనున్నట్లు చైనా జాతీయ మీడియా తెలిపింది.
Last Updated : Feb 28, 2020, 10:24 PM IST