మండుతున్న ఎండలు- బీచ్‌లకు పోటెత్తిన ప్రజలు - hod day in uk
బ్రిటన్‌లో ఎండలు మండిపోతున్నాయి. ఈ సంవత్సరంలోనే అత్యధిక ఉష్ణోగ్రత శుక్రవారం నమోదైంది. లండన్ పశ్చిమాన ఉన్న హీట్‌త్రో ఎయిర్పోర్ట్ వద్ద 37.8 డిగ్రీల ఉష్ణోగ్రత నమోదైనట్లు బ్రిటన్ వాతావరణ శాఖ తెలిపింది. వేడి వాతావరణం నేపథ్యంలో బ్రిటన్ ప్రజలు బీచ్‌లకు పోటెత్తారు. పెద్ద ఎత్తున సముద్రతీరాలకు తరలివెళ్లారు. దీంతో ప్రఖ్యాత బీచ్‌లన్నీ కళకళలాడాయి. కొన్ని ప్రాంతాల్లో భౌతిక దూరం నిబంధనలు పాటించలేదు. జనాభా అధికంగా ఉంది కాబట్టి వ్యక్తిగత దూరం సాధ్యం కాదని, బీచ్‌లకు దూరంగా ఉండాలని అధికారులు ప్రజలను కోరుతున్నారు.