Ida hurricane: 'ఇడా' బీభత్సం.. ఎటుచూసినా నీరే! - ఇడా హరికేన్ న్యూజెర్సీ
అమెరికాలో ఇడా హరికేన్ బీభత్సం సృష్టించింది. న్యూజెర్సీ నగరం పూర్తిగా వరద నీటిలో మునిగిపోయింది. ఒక్క న్యూజెర్సీలోనే హరికేన్ ప్రభావానికి 23 మంది మృతిచెందారు. ఇడా ధాటికి ఐదు రాష్ట్రాల్లో మొత్తం 46 మందికిపైగా మరణించినట్లు సమాచారం. వరదలతో చాలా ప్రాంతాల్లో వాహనాలు, కార్లు కొట్టుకుపోయాయి. న్యూజెర్సీ, పెన్సిల్వేనియాల్లో విద్యుత్ సరఫరాకు తీవ్ర అంతరాయం కలగడంతో లక్షల మంది ఇబ్బందులు ఎదుర్కొన్నారు.