క్రిస్మస్ వెలుగులతో కాంతులీనిన రొమేనియా - రొమేనియాలో క్రిస్మస్ వేడుకలు
క్రిస్మస్ వేడుకలకు రొమేనియా రాజధాని బుచారెస్ట్ సిద్ధమైంది. బుచారెస్ట్ వీధులు, ప్రధాన కూడళ్లు, పార్లమెంటు సహా ప్రభుత్వ భవనాలన్నీ క్రిస్మస్ విద్యుద్దీపాలంకరణతో కాంతులీనుతున్నాయి. రొమేనియా రాజధానిని అలకరించేందుకు ఏకంగా కోటి ఎల్‌ఈడీ లైట్లను ఉపయోగించారు. 40 కిలోమీటర్ల మేర ఎల్‌ఈడీలతో అందమైన ఆకృతులను తీర్చిదిద్దారు. ఈసారి కొవిడ్ నిబంధనల కారణంగా ఎక్కువ మందిని గుమిగూడవద్దని కోరిన అక్కడి ప్రభుత్వం నగరాన్ని ముస్తాబుచేసే కార్యక్రమాన్ని కాస్త ఆలస్యం చేసింది. బుచారెస్ట్‌ను అలంకరించేందుకు 2.7 మిలియన్ యూరోలను వెచ్చించింది.