అమెరికా వరదలు: వాగుల్ని తలపిస్తున్న వీధులు - అమెరికా
అమెరికాలోని అనేక రాష్ట్రాలను వరదలు ముంచెత్తాయి. కొలరాడో, కేన్సస్, ఓక్లహోమ రాష్ట్రాల మీదుగా వెళ్లే ఆర్కేన్సస్ నది ప్రమాద స్థాయిలో ప్రవహిస్తోంది. వరదల కారణంగా ఓక్లహోమ, కేన్సస్ రాష్ట్రాలను కలిపే టోల్ రోడ్డును మూసివేశారు అధికారులు. తిరిగి ఎప్పుడు ప్రారంభిస్తారో చెప్పలేమన్నారు. వాహనాల రాకపోకలకు ప్రత్యామ్నాయ మార్గాల కోసం అధికారుల ప్రయత్నాలు విఫలమయ్యాయి.