హాంగ్‌కాంగ్‌లో హోరెత్తిన నిరసనలు - చైనా బిల్లు
నేరపూరిత కేసుల విచారణ నిమిత్తం దేశ పౌరులను చైనాకు అప్పగించాలన్న బిల్లుకు వ్యతిరేకంగా హాంగ్‌కాంగ్ ప్రజల చేపట్టిన నిరసనలు ఉద్ధృతంగా జరుగుతున్నాయి. తాజాగా బిల్లును పూర్తి స్థాయిలో రద్దు చేయాలని డిమాండ్ చేస్తూ.. సుమారు 1000 మంది దేశ పోలీసు ప్రధాన కార్యాలయాన్ని ముట్టడించారు. వందల మంది వీధుల్లోకి చేరి నిరసనలు చేశారు. వాన్ చాయ్ జిల్లా కేంద్రంలోని ఇమ్మిగ్రేషన్ టవర్, హార్కోర్ట్ రోడ్ వద్ద ఆందోళనలు చేపట్టారు.