లైవ్ వీడియో: క్షణాల్లోనే పవర్ ప్లాంట్ నేలమట్టం - america
అమెరికా ఫ్లోరిడాలోని జాక్సన్విల్లే నగరంలో ఉన్న సెయింట్ జాన్స్ రివర్ పవర్ పార్క్ (ఎస్జేఆర్పీపీ) విద్యుత్ కేంద్రంలోని బాయిలర్లు, చిమ్నీని క్షణాల వ్యవధిలోనే కూల్చివేశారు అధికారులు. సంప్రదాయ సాంకేతిక పరిజ్ఞాన పద్ధతులను ఉపయోగించి అన్నీ ఒకేసారి కూలిపోయేలా ఏర్పాట్లు చేశారు. చిమ్నీ, బాయిలర్లు కూలిపోతున్న దృశ్యాలను డ్రోన్ కెమెరాతో చిత్రీకరించారు. 2018లోనే ఈ విద్యుత్ కేంద్రం మూతపడింది. గత ఏడాది జూన్లో ఇదే కేంద్రంలోని ఎస్సీఆర్ యూనిట్, కూలింగ్ టవర్లను కూల్చేశారు. 2020 వరకు కొత్త ప్రాజెక్టు నిర్మించేందుకు ప్రణాళిక చేస్తున్నారు.