మహిళల ర్యాలీకి పోలీసుల అడ్డు... భాష్పవాయువు ప్రయోగం - ఇస్తాంబుల్
అంతర్జాతీయ మహిళా దినోత్సవం రోజున టర్కీలో మహిళలకు చేదు అనుభవం ఎదురైంది. మహిళలపై హింసను నిషేధించాలని, ప్రత్యేక హక్కులు కల్పించాలని డిమాండ్ చేస్తూ ఇస్తాంబుల్ నగరంలో వేలాది మంది మహిళలు నిరసనలు చేపట్టారు. ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేస్తూ రోడ్లపైకి వచ్చారు. పోలీసులు ముందుగానే హెచ్చరికలు జారీ చేసినా... మహిళలు వెనక్కి తగ్గలేదు. చివరకు నిరసనకారులను చెదరగొట్టేందుకు పోలీసులు విచక్షణారహితంగా భాష్పవాయువును ప్రయోగించారు.
Last Updated : Mar 9, 2019, 11:44 AM IST