హైతీ భూకంపం భయానక దృశ్యాలు - హైతీ తాజా వార్తలు
కరీబియన్ దేశమైన హైతీలో సంభవించిన భూకంపం(Earthquake in haiti) భారీ ప్రాణ నష్టాన్ని మిగిల్చింది. ఇప్పటివరకు 304 మంది మృతి చెందినట్లు ఆ దేశ రక్షణ శాఖ పేర్కొంది. 1,800 మంది గాయపడగా.. పలువురు గల్లంతయ్యారు. మృతుల సంఖ్య మరింత పెరిగే అవకాశమున్నట్లు తెలుస్తోంది. శనివారం సంభవించిన భూకంపం.. రిక్టర్‌స్కేలుపై 7.2గా తీవ్రతగా నమోదైంది. సహాయక చర్యలు ముమ్మరంగా కొనసాగుతున్నాయి. భూకంపానికి చెందిన భయానక దృశ్యాలు ఇలా ఉన్నాయి.