దాడులతో 'గాజా' గజగజ.. ప్రాణభయంతో ప్రజలు - ఇజ్రాయెల్ దాడులు
ఇజ్రాయెల్ బలగాలు- హమాస్ ఉగ్రవాదుల మధ్య ఘర్షణ తీవ్రరూపం దాల్చుతోంది. ఇరు వర్గాల పరస్పర దాడులతో భయాందోళనకు గురైన పాలస్తీనియన్లు వలస బాట పడుతున్నారు. రెండు వర్గాల మధ్య తాజాగా జరిగిన దాడులతో గాజాలో మృతుల సంఖ్య 126కు పెరిగింది. గాజా సరిహద్దుల నుంచి వేల మంది పాలస్తీనియన్లు ప్రాణాలు అరచేతిలో పెట్టుకొని వలస బాట పడుతున్నారు. గాజా నుంచి హమాస్ ఉగ్రవాదులు ఇజ్రాయెల్‌పై రాకెట్ దాడులను కొనసాగిస్తున్నారు. శుక్రవారం వరకు 1,800 రాకెట్లను ఉపయోగించినట్లు సమాచారం.