పెంపుడు శునకం కోసం మొసలితో ఫైట్! - pet dog
అమెరికా ఫ్లోరిడాకు చెందిన రిచర్డ్ విల్బ్యాంక్స్ తన పెంపుడు కుక్క కోసం సాహసం చేశాడు. మొసలితో పోరాడి శునకాన్ని రక్షించాడు. రిచర్డ్.. వాకింగ్‌కు వెళ్లినప్పుడు తనతో పాటు పెంపుడు కుక్కను తీసుకెళ్లాడు. ఆ శునకం వెళ్తు.. వెళ్తూ పక్కనే ఉన్న చెరువులోకి దిగి.. అక్కడే ఉన్న మొసలి నోట చిక్కింది. వెంటనే రిచర్డ్ చెరువులోకి దిగి... మొసలి నుంచి శునకాన్ని విడిపించాడు. ఈ దృశ్యాలు ఫ్లోరిడా వైల్డ్‌లైఫ్ ఫెడరేషన్ ఏర్పాటు చేసిన కెమేరాలకు చిక్కాయి.