వసంతం వేళ నేరేడు పూల సోయగం - Spring season
వసంత రుతువు రాకతో ఉత్తర చైనా అత్యంత సుందరంగా రూపుదిద్దుకుంది. రహదారులు... పర్వత శ్రేణులు... జనావాస ప్రాంతాలు... ఎటు చూసినా పూలే దర్శనమిస్తున్నాయి. ఆహ్లాదకరంగా మారిన ప్రకృతి సోయగాలు అందరి హృదయాలను దోచేస్తున్నాయి. 'చైనాగోడ' సరిహద్దులోని హీబే రాష్ట్రం చెంగ్డే నగరంలో నేరేడు పూలు చూపరులను విశేషంగా ఆకట్టుకుంటున్నాయి.