తెలంగాణ

telangana

ETV Bharat / videos

హాంగ్​ కాంగ్​: నిరసనకారులను చితకబాదిన గూండాలు - కర్రలు

By

Published : Jul 22, 2019, 1:26 PM IST

హాంగ్​ కాంగ్​లో ఉద్రిక్తతలు తారా స్థాయికి చేరుకున్నాయి. ఆదివారం యుయెన్​ లాంగ్​ రైల్వే స్టేషన్​లో భయానక ఘటన చోటుచేసుకుంది. ప్రభుత్వానికి వ్యతిరేకంగా నిరసనలు చేపట్టిన వారిపై గూండాలు కిరాతకంగా దాడి చేశారు. కర్రలు, బ్యాటలతో విరుచుకుపడి రక్తం వచ్చేలా కొట్టారు. బాధితుల అరుపులతో స్టేషన్​ ప్రాంగణం దద్దరిల్లింది. కొంతమంది ఈ దృశ్యాలను చిత్రీకరించి సామాజిక మాధ్యమాల్లో పంచుకున్నారు. ఈ ఘటనలో 45మంది గాయపడ్డారు. ఒకరి పరిస్థితి విషమంగా ఉంది. పోలీసులకు సమాచారం అందించినప్పటికీ ఆలస్యంగా వచ్చారని బాధితులు ఆవేదన వ్యక్తం చేశారు.

ABOUT THE AUTHOR

...view details