మనసున్న న్యాయవాదికి మిస్ అమెరికా కిరీటం
ఉత్తర కరోలినాకు చెందిన ఛెస్లీ క్రిస్ట్ మిస్ అమెరికా- 2019గా నిలిచింది. మెక్సికోకు చెందిన అలెజాండ్రా గొంజాలెజ్ తొలి రన్నరప్‌గా నిలిచింది. నెవాడాలోని రెనోలో జరిగిన పోటీల్లో క్రిస్ట్‌కు అందాల రాణి కిరీటాన్ని ధరింపజేశారు. ఈ ఘనత సాధించగానే ఆమె ఆనందానికి అవధుల్లేవు. ఒక్కసారిగా భావోద్వేగానికి గురైంది. 27 ఏళ్ల క్రిస్ట్ న్యాయవిద్యను అభ్యసించారు. ఖైదీలకు శిక్షలను తగ్గించే కేసులను ఉచితంగా వాదించే న్యాయవాదిగా క్రిస్ట్ పేరు తెచ్చుకుంది.