పసిడి కాంతుల్లో హొయలుపోయిన సుందరీమణులు - women fashion show in hyderabad
ధగధగ మెరిసే పసిడి కాంతులు... విభిన్న శైలి వస్త్రశ్రేణిలో అందమైన ముద్దుగుమ్మలు తళుక్కుమని మెరిసిపోయారు. పెళ్లి కుమార్తెలకు కావాల్సిన ఆభరణాలను నగరవాసులకు అందించేందుకు యూవీ సంస్థ మూడు రోజుల పాటు నగరంలో యూవీ సంస్థ ఆధ్వర్యంలో ప్రదర్శన నిర్వహిస్తోంది. అమీర్‌పేటలోని మ్యారీగోల్డ్ హోటల్‌లో పోస్టర్ ఆవిష్కరణ కార్యక్రమం ఏర్పాటు చేశారు. ఈ కార్యక్రమంలో వర్ధమాన సినీ కథానాయిక రాశీసింగ్‌తో పాటు పలువురు మోడల్స్ పాల్గొని సందడి చేశారు. విభిన్న రకాలైన ఆభరణాలను పరిచయం చేస్తూ నిర్వహించిన ఫ్యాషన్ షో ఆకట్టుకుంది. మోడల్స్‌తో పాటు సినీ కథానాయిక రాశీసింగ్ ర్యాంప్‌పై వయ్యారి హంసనడకలతో మంత్రముగ్ధులను చేశారు.