Sirscilla drone visuals: సీఎం రాక కోసం సిరిసిల్ల ముస్తాబు.. ఆకట్టుకుంటున్న డ్రోన్ దృశ్యాలు - sirscilla drone visuals
ముఖ్యమంత్రి కేసీఆర్ రాక కోసం కార్మిక క్షేత్రమైన సిరిసిల్ల సర్వాంగ సుందరంగా ముస్తాబవుతోంది. రోడ్డుకు ఇరువైపులా మొక్కలు,ఫ్లెక్సీలతో నగరాన్ని అందంగా ముస్తాబు చేస్తున్నారు. సిరిసిల్ల బైపాస్ రోడ్డులో రూ. 70 కోట్లతో నిర్మించిన సమీకృత కలెక్టరేట్ భవనంతో పాటు రూ. 27 కోట్లతో నిర్మించిన నర్సింగ్ కళాశాలను రంగురంగుల విద్యుద్దీపాలతో అలంకరించారు. ప్రత్యేక అలంకరణలతో భవనాలు కొత్త శోభను తెచ్చిపెడుతున్నాయి. ఈ మేరకు వేములవాడ కూడలి నుంచి సమీకృత కలెక్టరేట్ వరకు డ్రోన్ దృశ్యాలను ప్రభుత్వం విడుదల చేసింది.
Last Updated : Jul 3, 2021, 1:20 PM IST