ఆలయంలో ఆకాశ జ్యోతి - god
శివనామస్మరణతో జోగులాంబ బాల బ్రహ్మేశ్వర స్వామి ఆలయం మారుమోగింది. మహాశివరాత్రి పర్వదినాన ఆలయానికి భక్తులు పోటెత్తారు. బ్రహ్మోత్సవాల్లో భాగంగా శివ మాల ధరించిన స్వాములు రాత్రి 12 గంటల సమయంలో ఆకాశ జ్యోతి వెలిగించారు. జ్యోతి దర్శించుకునేందుకు భక్తులు అధిక సంఖ్యలో తరలి వచ్చారు.