గోదావరిఖని మహిళల కోలాటం 'వండర్' - book
పెద్దపల్లి జిల్లా గోదావరిఖని మహిళలు కోలాటాలాడి జీనియస్ వండర్ బుక్ ఆఫ్ రికార్డులో చోటు సంపాదించారు. అంతర్జాతీయ మహిళా దినోత్సవాన్ని పురస్కరించుకుని పెద్దపల్లి జిల్లా గోదావరిఖనిలో 750 మంది మహిళలు నృత్యాలు ప్రదర్శించారు. రామగుండం ఎమ్మెల్యే కోరుకంటి చందర్ ఆధ్వర్యంలో నిర్వహించిన ఈ కార్యక్రమాంలో నారీమణులు లయబద్ధంగా కోలాటాలాడారు.