ఆమె చిత్రం.. ఆలోచింపజేస్తుంది! - చిత్రకారిణి
తరతరాలుగా ఆడవాళ్లు ఎదుర్కొంటున్న అనేక సమస్యలను కాన్వాస్ఫై అద్భుతంగా ఆవిష్కరించారు ప్రముఖ చిత్రకారిణి మైలవరపు రమణి. స్త్రీలపై జరుగుతున్న దాడులు, వారిని అసభ్యంగా చూపిస్తున్న తీరును ఎండగడుతూ ఆమె కుంచె నుంచి జాలు వారిన బొమ్మలు చూపరులను ఆకట్టుకోవడమే కాకుండా.. ఆలోచింపజేస్తున్నాయి. అంతర్జాతీయ మహిళా దినోత్సవాన్ని పురస్కరించుకుని రమణి గీసిన అందమైన చిత్తరువులను హైదరాబాద్ మాదాపూర్లోని గ్యాలరీలో ప్రదర్శన ఏర్పాటు చేశారు. స్త్రీల సమస్యలపై ఓ మహిళా కుంచె నుంచి జాలు వారిన ఆ చిత్రాలను మీరూ చూసేయండి..!