తెలంగాణ

telangana

ETV Bharat / videos

నగరం నడిబొడ్డున కాలిబూడిదైన బస్సు.. అంతా క్షణాల్లోనే..! - Nagpur bus caught fire

By

Published : Apr 1, 2022, 4:10 PM IST

Updated : Feb 3, 2023, 8:21 PM IST

Bus Caught Fire: మహారాష్ట్ర నాగ్​పుర్​లోని మెడికల్ చౌక్​ వద్ద ఘోర ప్రమాదం జరిగింది. ప్రయాణికులతో వెళ్తోన్న సిటీ బస్సులో ఒక్కసారిగా మంటలు చెలరేగాయి. ప్రమాదాన్ని గుర్తించి అప్రమత్తమైన డ్రైవర్.. బస్సును పక్కకు ఆపి ప్రయాణికులను దించేశాడు. దీంతో పెను ప్రమాదం తప్పింది. అదృష్టవశాత్తూ ఈ ఘటనలో ఎటువంటి ప్రాణనష్టం జరగలేదు. అయితే బస్సు మంటల్లో కాలి బూడిదైంది. షార్ట్​ సర్క్యూట్​ కారణంగానే ప్రమాదం జరిగినట్లు తెలుస్తోంది. నాగ్​పుర్​లో నెల రోజుల్లోనే ఇలాంటి రెండు ఘటనలు జరగడం గమనార్హం. అయితే.. పట్టణంలో ఎండల తీవ్రత పెరిగింది. సరాసరిగా 42 డిగ్రీల సెల్సియస్ వరకు ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి.
Last Updated : Feb 3, 2023, 8:21 PM IST

ABOUT THE AUTHOR

...view details