నిట్లో వసంతోత్సవ సందడి - SPREE
నిత్యం పుస్తకాలతో కుస్తీ పట్టే విద్యార్థులు కుంచెలు పట్టుకుని పెయింటింగ్ వేస్తున్నారు. పాశ్చాత్య సంగీతానికి నృత్యాలు చేస్తూ సందడి చేస్తున్నారు. సృజనాత్మకతను వెలికితీయటమే లక్ష్యంగా 'కళాక్షేత్ర' పేరుతో వరంగల్ జాతీయ సాంకేతిక విద్యా సంస్థ నిట్లో నిర్వహిస్తున్న వసంతోత్సవ వేడుకలు కోలాహలంగా సాగుతున్నాయి.