వరద నీటిలో సెల్ఫీ కోసం బాలికల దుస్సాహసం
ఇటీవల యువతకు సెల్ఫీల పిచ్చి ఎక్కువైంది. తాజాగా సెల్ఫీ కోసం నదిలోకి దిగిన ఇద్దరు యువతులను ప్రాణాలకు తెగించి అధికారులు కాపాడారు. మధ్యప్రదేశ్ ఛింద్వాడాకు చెందిన ఆరుగురు యవతులు విహారయాత్ర కోసం జున్నార్డియోలోని ఖేడి గ్రామానికి వెళ్లారు. అందులో ఇద్దరు సెల్పీ కోసం పెంచ్ నదిలోకి దిగారు. ఇంతలో వరదలకు నది నీటి ప్రవాహం పెరిగింది. ఇద్దరు యువతులు నదిలో చిక్కుకుపోయారు. పోలీసులకు సమాచారం ఇవ్వగా అధికారులు అతి కష్టం మీద వారిని రక్షించారు.