కొవిడ్ సెంటర్‌లో గార్బా నృత్యం-వీడియో వైరల్ - Covid-19 patients Garba dance
మహారాష్ట్రలోని ఓ కొవిడ్ సెంటర్‌లో దేవీశరన్నవరాత్రి ఉత్సవాలను నిర్వహించారు. ముంబయి గోరెగావ్‌లోని నెస్కో కొవిడ్ సెంటర్‌లో కరోనా బాధితులు, ఆరోగ్యకార్యకర్తలతో కలిసి గార్బా నృత్యం చేశారు. సంగీతానికి అనుగుణంగా నృత్యాలు చేశారు. ప్రస్తుతం ఈ దృశ్యాలు సామాజిక మాధ్యమాల్లో వైరల్‌గా మారాయి.