ఇవి ప్రజల ఆశలను మోసే కుర్చీలు...!
అతిపెద్ద ప్రజాస్వామ్య దేశంలో ఓటుకున్న విలువ తెలియజేసేందుకు ఓ గుజరాత్ కళాకారుడికొచ్చిన ఆలోచన అందరినీ ఆకట్టుకుంటోంది. ప్రజలందరూ తమ ఓటు హక్కు వినియోగించుకుని 543 మంది ప్రజా ప్రతినిధులను ఎంచుకోవాలని కోరుతూ... 543 కుర్చీలను సామాన్యులు తమ భుజాలపై మోసే విధంగా ఈ ప్రతిమను రూపొందించడం విశేషం. ఇందుకు ఆ కళాకారులుడు ఎంతో కష్టపడ్డాడు. రైల్వే స్టేషన్లను సందర్శించి వివిధ ప్రాంతాల ప్రజలను క్షుణ్ణంగా పరిశీలించాడు. వాటి ఆధారంగా ఈ చిత్రంలో కనిపిస్తోన్న సామాన్యుల ప్రతిమలను తీర్చిదిద్దాడు.