వైరల్-పోలీసులపై రాళ్లు రువ్విన గ్రామస్థులు! - మథుర న్యూస్
ఉత్తర్ప్రదేశ్ మథురలో పోలీసులపై రాళ్లు రువ్వారు అదే ప్రాంతానికి చెందిన ప్రజలు. గురువారం 21 ఏళ్ల పాల వ్యాపారి యాక్సిడెంట్లో మరణించగా.. అందుకు కారణమైన మహీంద్రా స్కార్పియో డ్రైవర్ను బంధించి తీసుకెళ్లారు మథుర వాసులు. బాధితుడిని విడిపించేందుకు వెళ్లిన నేపథ్యంలో ఆ గ్రామస్థులు పోలీసులపై తిరగబడ్డారు. ఈ ఘటనలో ఇద్దరు పోలీసులకు తీవ్రంగా గాయాలయ్యాయి.