నడిరోడ్డుపై దారుణ హత్య.. బావను కత్తితో పొడిచి.. - సోదరి వివాహ వివాదంతో హత్యతు తెగించిన యువకుడు
ఉత్తర్‌ప్రదేశ్ మొరాదాబాద్‌లో పట్టపగలే అందరూ చూస్తుండగా.. ఓ యువకుడు దారుణ హత్యకు గురయ్యాడు. వ్యక్తిగత కక్షతో ఆ వ్యక్తిని మరో వ్యక్తి అతి దారుణంగా కత్తితో పలుమార్లు పొడిచి చంపాడు. నడి రోడ్డుపై జరుగుతున్న ఈ దారుణాన్ని అడ్డుకునేందుకు స్థానికులు ప్రయత్నించినా ఫలితం లేకపోయింది. హత్య చేసి పారిపోతున్న అతడిని స్థానికులు పట్టుకుని పోలీసులకు అప్పగించారు. నిందితుడి సోదరికి మృతుడి సోదరుడికి పదిహేను రోజుల క్రితం వివాహం జరిగింది. ఈ పెళ్లిని మృతుడు వ్యతిరేకిస్తూ వస్తున్నారు. ఇదే విషయం కలహాలకు కారణమైంది. దీంతో నిందితుడు హత్యకు తెగబడినట్లు తెలుస్తోంది. ఈ మర్డర్ వీడియో సామాజిక మాధ్యమాల్లో వైరల్‌గా మారింది.
Last Updated : Sep 19, 2021, 8:05 PM IST