చెరుకుతోటలో రెండు అందమైన చిరుత పిల్లలు - చెరుకుతోటలో రెండు అందమైన చిరుత పిల్లలు
కర్ణాటక చామరాజనగర్‌లోని ముదగెరేలో రెండు చిరుతపులి పిల్లలను అటవీశాఖ అధికారులు స్వాధీనం చేసుకున్నారు. గ్రామంలోని చెరుకుతోటలో అప్పుడే పుట్టిన రెండు అందమైన చిరుతపులి పిల్లలను గుర్తించిన గ్రామస్థులు అటవీశాఖ అధికారులకు సమాచారం ఇచ్చారు. దీంతో అక్కడకు చేరుకున్న అధికారులు చిరుతపులి పిల్లలను స్వాధీనం చేసుకుని సంరక్షణా కేంద్రానికి తరలించారు.