సీబీఎల్: కరువట్టా బోట్ రేస్ విజేతగా ట్రోపికల్ టైటాన్స్ - కేరళ
కేరళలో ఛాంపియన్స్ బోట్ లీగ్(సీబీఎల్) పోటీలు ఉత్సాహంగా సాగుతున్నాయి. శనివారం అలప్పుజాలో నిర్వహించిన సీబీఎల్లోని మూడో దశ- కరువట్టా బోట్ రేస్‌లో ట్రోపికల్ టైటాన్స్ బోట్ క్లబ్(నడుబాగమ్) విజేతగా నిలిచింది. 4:12:11 నిమిషాల టైమింగ్‌తో తొలి స్థానంలో నిలిచి ట్రోఫీ ఎగరేసుకుపోయింది. ఈ టీమ్‌కు రూ. 5 లక్షల ప్రైజ్‌మనీ లభించనుంది. కోస్ట్ డామినేటర్స్ 4:12:90 నిమిషాల టైమింగ్‌తో రెండో స్థానంలో నిలిచింది. ఆగస్టు 31న నెహ్రూ బోట్ రేస్‌తో ప్రారంభమైన సీబీఎల్లో మొత్తంగా 12 రేస్‌లు నిర్వహించనున్నారు. ఇప్పటికే 3 పూర్తయ్యాయి. నవంబర్ 23న ప్రెసిడెంట్స్ బోట్ రేస్‌తో సీబీఎల్ పోటీలు ముగియనున్నాయి.
Last Updated : Sep 30, 2019, 3:56 PM IST