వీధి కుక్కలకు రోజూ చికెన్, పన్నీర్‌తో ఆహారం! - karnataka mangaluru
ఇంట్లో కుక్కలను పెంచుకోవడమంటే అందరికీ ఇష్టమే. కానీ వీధిలో కుక్కలను చూస్తే చాలా మంది ముఖం తిప్పుకుంటారు. కొంతమంది అయితే వాటినసలు దరిచేయనీయరు కూడా. కానీ కర్ణాటక మంగళూరుకు చెందిన నమ్రుత ప్రభు అనే మహిళ శునకాలను దగ్గరికి తీసుకోవడమే కాదు.. వాటి ఆలనా పాలనా చూస్తున్నారు. రోజూ వాటికి కావాల్సిన ఆహారాన్ని స్వయంగా తీసుకెళ్లి అందిస్తున్నారు. అన్నంతో పాటు చికెన్, పన్నీర్, పెరుగు వంటి ఆహార పదార్థాలను టైం ప్రకారం తీసుకెళ్తున్నారు. రెండేళ్లుగా నమ్రుతా ఈ పని చేయడం విశేషం. నగరంలోని 13 ప్రాంతాల్లో దాదాపు 64 కుక్కలకు ఆహారాన్ని అందిస్తూ తన పెద్ద మనసును చాటుకుంటున్నారు. జంతువుల పట్ల ఆమె చూపిస్తున్న ప్రేమపై అన్ని వైపులనుంచి ప్రశంసలు దక్కుతున్నాయి.
Last Updated : Nov 29, 2019, 12:36 PM IST