గుక్కెడు నీళ్లకోసం కిలోమీటర్ల పొడవు లైను! - కరవు
ఉత్తరాదిలో భారీ వర్షాలు పడి నదులు వరదలై పారుతుంటే... తమిళనాట మాత్రం నీటి కష్టాలు రెట్టింపు అవుతున్నాయి. రాష్ట్రంలో భూగర్భ జలాలు అడుగంటిపోయాయి. గుక్కెడు మంచి నీళ్ల కోసం ప్రజలు చేతిపంపుల వద్ద బారులు తీరిన దృశ్యం.. అక్కడ దుర్భర స్థితిని మన కళ్లకు కడుతుంది. ప్రభుత్వం చేపడుతున్న చర్యలు తమకు ఏ మాత్రం ఉపశాంతి కల్గించడంలేదని వారు వాపోతున్నారు.