ట్రాఫిక్ జామ్ లేని బెంగళూరు రోడ్లు ఎప్పుడైనా చూశారా?
ఉదయం నుంచి కర్ణాటకవాసులు 'జనతా కర్ఫ్యూ'లో స్వచ్ఛందంగా పాల్గొంటున్నారు. దాదాపు అన్ని ప్రాంతాల్లోనూ దుకాణాలు తెరుచుకోలేదు. అందరూ ఇళ్లకే పరిమితమయ్యారు. నిత్యం రద్దీగా ఉండే బెంగళూరు రహదారులు మొత్తం ఖాళీగా దర్శనమిస్తున్నాయి. అయినప్పటికీ.. పోలీసులు అప్రమత్తంగా వ్యవహరిస్తున్నారు. రోడ్డుపైకి వస్తున్న కొన్ని వాహనాలను అడ్డుకుని.. కర్ఫ్యూ సమయంలోనూ ప్రయాణించడానికి గల కారణాలను అడిగి తెలుసుకుంటున్నారు. ప్రాణాంతక కరోనా వైరస్‌పై పోరుకు జనతా కర్ఫ్యూకు ప్రధాని మోదీ పిలుపునిచ్చారని గుర్తుచేస్తున్నారు.