'రైల్వే ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా పోరాడదాం' - SRMU
రైల్వే ప్రైవేటీకరణను వ్యతిరేకిస్తూ చెన్నైలోని చెట్పట్లో నిరసనలు చేపట్టారు రైల్వే ఉద్యోగ సంఘాల నేతలు. ప్రైవేటీకరణలో భాగంగా తొలిదశలో తమిళనాడులోని 5 రైళ్లను ప్రైవేటు విభాగాలకు అప్పగించాలని నిర్ణయించినట్లు ఎస్ఆర్ఎమ్యూ ప్రధాన కార్యదర్శి కన్నయ్య వెల్లడించారు. అదే జరిగితే ప్రస్తుతం ఉన్న టికెట్ ధర మూడు రెట్లు పెరుగుతుందని ఆందోళన వ్యక్తం చేశారు. అందరూ కలిసికట్టుగా ప్రైవేటీకరణను వ్యతిరేకించాలని పిలుపునిచ్చారు.
Last Updated : Oct 2, 2019, 12:01 AM IST