నేటి నుంచి బద్రినాథుడి దర్శనం - యమునోత్రి
ఉత్తరాఖండ్ రాష్ట్రంలో కొలువైన నాలుగు పుణ్యక్షేత్రాల్లో ఒకటైన బద్రినాథ్ ఆలయం తలుపులు తెరుచుకున్నాయి. భక్తులు బద్రినాథుడిని దర్శించుకుంటున్నారు. ఆలయాన్ని విద్యుత్ దీపాలు, పూల మాలలతో సర్వాంగ సుందరంగా అలంకరించారు. వేల మంది యాత్రికుల సమక్షంలో ఆలయ తలుపులు తెరిచారు వేద పండితులు. ఛార్‌దామ్ యాత్రలో భాగంగా చివరిగా ఈ ఆలయాన్ని సందర్శించి యాత్రను ముగిస్తారు భక్తులు. ఇప్పటికే గంగోత్రి, యమునోత్రి, కేదార్నాథ్ ఆలయాలు తెరుచుకున్నాయి.