హిమగిరి సొగసులు.. మనసు దోచే మంచు అందాలు
హిమాచల్ ప్రదేశ్, ఉత్తరాఖండ్ రాష్ట్రాల్లో భారీగా కురుస్తోన్న మంచుతో పలు ప్రాంతాలు ధవళ (తెలుపు) వర్ణంలో మెరిసిపోతున్నాయి. కులు, మనాలీ జిల్లాలో సుమారు 45 సెంటీమీటర్ల మేర మంచు పేరుకుపోయి సుందర దృశ్యాలు దర్శనమిస్తున్నాయి. హిమాచల్ ప్రదేశ్ లోని జాతీయ రహదారి ఎన్‌హెచ్ 5లో మంచు కారణంగా రాకపోకలు నిలిచిపోయాయి. ఉత్తరాఖండ్‌లోని ఆల్మోరా జిల్లాలో భారీగా మంచు కురిసే అవకాశం ఉన్నందున హెచ్చరికలు జారీ చేశారు అధికారులు.