లైవ్ వీడియో: కేరళలో రోడ్డుపై కారు బీభత్సం - ఘోర రోడ్డు ప్రమాదం
కేరళలోని అలప్పుజాలో ఓ కారు బీభత్సం సృష్టించింది. పొచ్చకల్లో అతి వేగం వల్ల అదుపుతప్పి రోడ్డు పక్కన నడుస్తున్న పాదచారులపైకి దూసుకెళ్లింది. ఆ దృశ్యాలు ఎంతో భయానకంగా ఉన్నాయి. కారు వేగంగా ఢీ కొట్టడం వల్ల నలుగురు పాదచారులు (విద్యార్థులు) పక్కనే ఉన్న కాలువలోకి ఎగిరిపడ్డారు. ఒళ్లు గగుర్లు పొడిచే ఈ దృష్యాలన్నీ సీసీటీవీలో రికార్డయ్యాయి. అనంతరం రోడ్డుపై వెళ్తున్న బైక్లను ఢీకొట్టింది కారు. ఈ ఘటనలో మొత్తం ఆరుగురు గాయపడ్డారు. క్షతగాత్రులను స్థానిక ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు.