కొండచరియల కింద మనిషి - కాపాడిన శునకం - జమ్ము
జమ్ము-శ్రీనగర్ హైవేపై కొండ చరియలు విరిగిపడిన ఘటనలో మట్టిదిబ్బలో కూరుకుపోయాడు ఓ వ్యక్తి. సీఆర్పీఎఫ్నకు చెందిన ఓ శునకం ఆ వ్యక్తిని గుర్తించి, దళాన్ని అప్రమత్తం చేసింది. వెంటనే స్పందించిన జవాన్లు ప్రమాదానికి గురైన వ్యక్తిని రక్షించి.. ఆసుపత్రికి తరలించారు.