బెదరని వనిత.. కింగ్ కోబ్రాను చేతపట్టి.. - ఒడిశా వార్త
కింగ్ కోబ్రాను చూస్తే ఎవరైన భయపడతారు. కానీ ఒడిశాలోని మయూర్భంజ్ జిల్లాలో ఈ కోబ్రాను సస్మతా గోచైట్ అనే మహిళ రక్షించింది. సస్మత ఇంట్లోకి శనివారం రాత్రి సమయంలో కోబ్రా ప్రవేశించింది. ఆమె కుమారుడు దానిని చూసి ఆడుకునే వస్తువనుకుని అటువైపుగా పాకుకుంటూ వెళ్లాడు. ఇది గమనించిన సస్మత భర్త పిల్లాడిని తీసుకుని భయంతో ఇంటి బయటికి వెళ్లాడు. కానీ సస్మత మాత్రం పాముని పట్టుకుని.. అటవి అధికారుల సహకారంతో అడవిలో వదిలిపెట్టింది. ఇంతకు మునుపెన్నడు ఆమె పామును పట్టుకోకపోవడం విశేషం.