ప్రైవేట్ బస్సులో మంటలు.. త్రుటిలో తప్పిన ప్రమాదం - బస్సులో చెలరేగిన మంటలు
కర్ణాటక బీదర్ జిల్లాలోని హుమ్నాబాద్ సమీపంలో బుధవారం రాత్రి ఓ ప్రైవేట్ బస్సులో మంటలు చెలరేగాయి. ప్రయాణ సమయంలో బస్సులో 17 మంది ప్రయాణికులు ఉండగా.. త్రుటిలో పెను ప్రమాదం తప్పింది. ఇంజిన్ నుంచి మంటలు వ్యాపించడాన్ని పసిగట్టిన డ్రైవర్.. తక్షణమే బస్సు దిగాలని ప్రయాణికుల్ని అప్రమత్తం చేశాడు. అంతకంతకూ విస్తరించిన మంటలు.. క్షణాల వ్యవధిలోనే తీవ్ర స్థాయిలో వ్యాప్తి చెంది, బస్సును దగ్ధం చేశాయి.