భూటాన్లో మోదీకి అడుగడుగునా బ్రహ్మరథం - ప్రధాని
రెండు రోజుల పర్యటన కోసం భూటాన్ చేరుకున్న ప్రధానమంత్రి నరేంద్ర మోదీకి అక్కడి ప్రజలు అడుగడుగునా బ్రహ్మరథం పట్టారు. మోదీ ప్రయాణించిన రోడ్లన్నీ జనసందోహంగా మారాయి. చిన్నా, పెద్దా అనే భేదం లేకుండా రోడ్లకు ఇరువైపులా ప్రజలు త్రివర్ణ పతాకాన్ని పట్టుకుని మోదీకి ఘన స్వాగతం పలికారు. భూటాన్ రాజధాని థింపులోని హొటల్ తాజ్ థషిలో ప్రవాస భారతీయులను కలిశారు ప్రధాని. 'మోదీ.. మోదీ' అనే నినాదాలతో హోటల్ ప్రాంగణం దద్దరిల్లింది.
Last Updated : Sep 27, 2019, 7:07 AM IST