ఎల్డీఎఫ్, యూడీఎఫ్ కార్యకర్తల ఘర్షణ - యూడీఎఫ్
కేరళ కొల్లాంలో లోక్సభ ఎన్నికల ప్రచారం చివరి రోజు ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. పూయప్పల్లిలో ఎల్డీఎఫ్ (లెఫ్ట్ డెమొక్రటిక్ ఫ్రంట్), యూడీఎఫ్ (యునైటడ్ డెమొక్రటిక్ ఫ్రంట్) కార్యకర్తల మధ్య ఘర్షణ చెలరేగింది. ఇరు వర్గాల వారు కర్రలతో విచక్షణారహితంగా దాడి చేసుకున్నారు. రాష్ట్రంలో రేపు లోక్సభ ఎన్నికల పోలింగ్ జరగనుంది.