Live Video: యువకుడ్ని గుద్ది చంపిన ఎద్దు - karnataka news
కర్ణాటక గడగ జిల్లాలో ఘోరం జరిగింది. ఎద్దు పరిగెత్తుతూ వచ్చి ఢీకొట్టడం వల్ల ఓ యువకుడు అక్కడికక్కడే మృతి చెందాడు. సూరంగి గ్రామంలో కారా హున్నిమే వేడుక నిర్వహిస్తుండగా ఈ ఘటన జరిగింది. వేగంగా వస్తున్న ఎద్దుకు కిరణ కుమార మలకాజప్ప (22) అడ్డుగా నిలవగా.. అది కడుపులో పొడిచింది. అక్కడికక్కడే అతడు ప్రాణాలు విడిచాడు. సైనిక వ్యాయామ పరీక్షల్లో ఇటీవలె ఉత్తీర్ణత సాధించి.. రాత పరీక్షల కోసం సన్నద్ధమవుతున్న కిరణ కుమార మరణంతో గ్రామంలో విషాదం అలుముకుంది. ఎడ్ల పందేల నిర్వహకులపై పోలీసులు కేసు నమోదు చేశారు.
Last Updated : Jun 28, 2021, 10:58 PM IST