వర్ణరంజితంగా మైసూరు దసరా వేడుకలు - సంప్రదాయ మైసూరు దసరా ఉత్సవాలు
మైసూరులో దసరా ఉత్సవాలు ఘనంగా జరుగుతున్నాయి. రాజవంశస్థుల ఆధ్వర్యంలో నిర్వహించిన జంబూ సవారీ ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది. రాజభవనంలో క్రీడా, సాంస్కృతిక పోటీలు సందర్శకులను ఊర్రూతలూగించాయి. వజ్రముష్టి కలగ పురాతన మార్షల్ ఆర్ట్స్ పోటీలు అందరినీ ఆకట్టుకున్నాయి. బన్నీ మంటప మైదానంలో కాగడాల ప్రదర్శన అత్యద్భుతంగా నిలిచింది. 400 ఏళ్లుగా సంప్రదాయంగా చేస్తున్న ఈ వేడుకలను చూడడానికి దేశ, విదేశాల నుంచి లక్షలాదిగా భక్తులు, సందర్శకులు మైసూరుకు చేరుకున్నారు.