సీఎం ఎదుటే వాగ్వాదానికి దిగిన మంత్రి, ఎంపీ - కర్ణాటక సీఎం సభలో రసాభాస
కర్ణాటక ముఖ్యమంత్రి బసవరాజు బొమ్మై సమక్షంలోనే రాష్ట్ర మంత్రి, ప్రతిపక్ష పార్టీ ఎంపీ వాగ్వాదానికి దిగారు. రామనగర ప్రాంతంలో నిర్వహించిన ఓ కార్యక్రమంలో కాంగ్రెస్ ఎంపీ డీకే సురేష్, మంత్రి సీఎన్ అశ్వత్‌నారాయణ బాహాబాహీకి దిగారు. అభివృద్ధి పనులకు సంబంధించిన విషయంలో నేతలు ఇద్దరూ తీవ్ర విమర్శలు చేసుకున్నారు. ఒకరిపైకి మరొకరు దూసుకెళ్లారు. అయితే స్టేజీ పైన ఉన్న భద్రతా సిబ్బంది ఇరువురు నేతలను అడ్డుకున్నారు. ఒకరిపైకి మరొకరు వెళ్లకుండా ఆపి సముదాయించారు.